News

పాడేరులో గిరిజన సాంప్రదాయ బడ్డు ఉత్సవం

271views

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులోని గిరిజనులు ప్రతి ఎటా ఏప్రిల్ మాసంలో ఇటుకల పండగను ఆనవాయితీగా జరుపుకుంటారు.ఇటుకల పండుగలో భాగంగా పాత పాడేరులో బడ్డు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇటుకల పండగ తరువాత కురిసే తోలకరి వానలకు వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు వ్యవసాయ పనిముట్లు ప్రత్యేక పూజలు చేస్తారు.పిదప ఆనవాయితీగా గిరిజన ప్రాంతాలలో గిరి విల్లంబులలో వేట సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.మహిళలూ గ్రామ పొలిమేరల్లో తాచేరు సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.

ఇందులో భాగంగా శనివారం నాడు బడ్డు ఉత్సవంలో అన్నదమ్ముల ఒక వైపు, మరోవైపు బామ్మర్డులు మధ్యలో హోరాహోరీ పోరు కొనసాగింది. గ్రామస్తులు మహిళలతో కలిసి గిరిజన సాంప్రదాయ థింసా నృత్యం చేశారు.ఆదివారం నాడు అక్క చెళ్ళిల్లు, వదిన మరదలు మధ్యలో హోరాహోరీగా బడ్డు ఉత్సవం కొనసాగింది.విజయం తరువాత అందరు కలిసి సహపంక్తి విందు భోజనలు ఏర్పాటు చేసుకుంటారు. ఉత్సాహం తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.