News

అయోధ్య రామ మందిరం పాదయాత్ర విజయవంతం

307views

గత నెల 16న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పాకలపాడు గురుదేవుల ఆశ్రమం నుండి నుంచి అయోధ్య రామ మందిరానికి రామానంద స్వామీజీ ఆధ్వర్యంలో 21 మంది భక్తులు తలపెట్టిన పాదయాత్ర ఈనెల 17న అయోధ్య చేరుకోవడంతో విజయవంతంగా ముగిసిందని అయోధ్య పాదయాత్రికుడు చిక్కుడు బట్టి గ్రామానికి చెందిన గెమ్మెల అప్పలకొండ తెలిపారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కృష్ణాపురం నుండి మొదలైన పాదయాత్ర ఒడిస్సా, చత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్, మీదుగా 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య చేరుకుని బాల రాముని దర్శించుకున్నామన్నారు. దారి పొడవునా భోజనం, వసతులు అందించిన భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సుమారు 30 రోజులపాటు చారిత్రాత్మకమైన పాదయాత్ర చేసి తిరిగి వచ్చిన భక్త బృందానికి, గురువు రామానంద స్వామికి కృష్ణాపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు అన్నారు. ఇది జీవితంలో మర్చిపోలేని మంచి అనుభూతిగా మిగిలిపోయిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు మోహన్ దాస్, రమణ, గిరి, కొండబాబు, మధు, రాంబాబు పాల్గొన్నారు.