అయ్యంబొట్లపల్లెలో కాకతీయ శాసనం
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రామచంద్రాపురం(అయ్యంబొట్లపల్లె) శివాలయం చెంత ముచలిందనాగ శిలాశాసనాన్ని చారిత్రక పరిశోధకుడు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్ గుర్తించారు. కాకతీయుల ఏలుబడిలోని మెట్టవాడ(ప్రస్తుతం వినుకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, వై.పాలెం ప్రాంతాలు)లోని దువ్వలి కంపణంలో గల వెల్మపల్లి(ప్రస్తుతం త్రిపురాంతకం మండలం వెల్లంపల్లె)...







