News

హిందూపేరుతో అద్దెకి దిగిన ముస్లిం యువతి… అరెస్ట్

Aisha 18 and Alaa, 22, members of the group Kvinder I Dialog and wearer of the Islamic clothing the niqab, pass out flyers to promote their group's protest against the Danish face veil ban which will come into effect August 1, 2018, in Copenhagen, Denmark, July 31, 2018. REUTERS/Andrew Kelly
484views

డెహ్రాడూన్‌లోని రైవాలా ప్రాంతంలో ఓ ముస్లిం యువతి హిందువుగా పేరు మార్చుకొని ఓ ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చి, వెరిఫికేషన్ చేయగా ఆమె హిందువు కాదని, ముస్లిం అని అసలు విషయం బయటపడింది. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసి, ఇంట్లో అద్దెకు దిగిందని తెలిపారు. దీంతో ముస్లిం యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇంటి యజమాని సాగర్ గిరి ఫిర్యాదుతో పోలీసులు కూడా ముస్లిం యువతికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. దాంట్లో తెహ్రీ గర్వాల్ అని వుంది.

కానీ.. ఆమె రాణి అని హిందూ పేరు చెప్పుకొని, అద్దెకు దిగింది. ఈ ప్రాంతంలో యువతి పూజా సామాగ్రి అమ్ముకునేదని స్థానికులు అంటున్నారు. అలాగే ఓ రాజకీయ పార్టీ సభ్యత్వం కూడా ఈమె తీసుకుంది. అలాగే సభ్యత్వం కోసం ప్రజల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తోంది. అయితే.. ఆమె ఇంటి బయట ముస్లింల సంచారం బాగా పెరగడంతో ప్రజలకు అనుమానం వచ్చింది. యజమానికి కూడా అనుమానం వచ్చి, పత్రాలను పరిశీలించగా… ముస్లిం అని బయటపడింది. మరోవైపు ఆ గ్రామ పెద్దలు కూడా ముస్లిం యువతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.