News

దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర‌: ఎన్‌.ఐ.ఎ

469views

భాగ్య‌న‌గ‌రం: దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర ప‌న్నింది. ఈ మేర‌కు ఎన్‌.ఐ.ఎ వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా దాడులు చేప‌ట్టిన ఎన్‌.ఐ.ఎ.. తెలంగాణ‌లో న‌లుగురిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో క‌త్తులు, రాడ్ల‌తో మూకుమ్మ‌డి దాడుల‌కు పీ.ఎఫ్‌.ఐ వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్టు ఎన్‌.ఐ.ఎ పేర్కొంది. పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌లు ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు గుర్తించింది. ఉగ్ర శిక్ష‌ణ‌కు ఇత‌ర ప్రాంతాల నిధులు సేక‌రించిన‌ట్టు ఎన్‌.ఐ.ఎ అధికారులు వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి