News

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… భక్తసంద్రమైన అహోబిలం క్షేత్రం

484views

నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథ‌మ నందిలో కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు – మన గుడి – మన బాధ్యత) జిల్లా వ్యాప్తంగా విస్తరించటం విశేషం. ఈ కార్య‌క్ర‌మం ఆస్తికులలో భక్తిభావం ఇనుమడింపజేస్తూ నిరంతర శ్రద్దా కేంద్రాలైన దేవాలయాల పరిశుభ్రతగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డుతోంది.

నంద్యాల జిల్లాలో నలమల అడవుల మధ్య కీకారణ్యంలో వెలసి నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ అహోబిలం నారసింహ క్షేత్రం సేవకులతో జన సంద్రమైంది. జిల్లా వ్యాప్తంగా 25 గ్రామాలు నుండి ఏడు బస్సులలో, బస్సులు వెళ్ళలేని పావన నరసింహ స్వామి వరకు ట్రాక్టర్లలో బైకులలో దాదాపు 450 మంది ఈ కార్యక్రమంలో స్వ‌చ్ఛందంగా పాల్గొనటం విశేషం.

గుడి పరిశుభ్రతలో పాల్గొన్న వారందరు కార్యక్రమం తరువాత గోవిందా నామాల ఘోషతో నగరం సంకీర్తనలో పాల్గొనడం చెప్పుకోద‌గ్గ అంశం. కార్య‌క్ర‌మంలో రాయలసీమ ధర్మ జాగరణ జోనల్ కన్వీనర్ శ్రీ రామ్ ప్రసాద్, విశ్రాంత పరిశ్రమల సంచాలకుడు శివకుమార్ రెడ్డి, ధర్మజాగరణ కార్యకర్తలు, ప‌లువురు భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి