
461views
లీసెస్టర్: లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది.
“లీసెస్టర్‌లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ మత ప్రాంగణాలు, చిహ్నాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఈ విషయాన్ని బ్రిటన్ అధికారుల దృష్టికి స్పష్టంగా తీసుకు స్పష్టంగా వస్తున్నాము. ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరాము. బాధిత ప్రజలకు రక్షణ కల్పించాలని మేము అధికారులను కోరుతున్నాము” అని భారత హైకమిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Source: Nijamtoday





