News

అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు

359views

జూబ్లీహిల్స్ : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి పోలీసులు నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.. మిగిలిన ఐదుగురు మైన‌ర్లు జువెనైల్ హోంలో ఉన్నారు. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయ‌మూర్తికి తెలిపింది.

నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను సోమ‌వారం పోలీసులు చేప‌ట్ట‌గా చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్ళిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు వివ‌రంగానే స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకున్నారు.

మరో వైపు ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. జువైనల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతిని పోలీసులు కోరనున్నారు. బాలిక అత్యాచారం కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్‌లకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇన్నోవా వాహనంలో లభ్యమయిన ఎవిడెన్స్ కు, ఈ డీఎన్ఏ పరీక్షలు అవసరమని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసు పరిశోధన మరింత శాస్త్రీయంగా జరుగుతుందన్నది పోలీసుల వాదన. వారి నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్ కు పంపాలన్న యోచనలో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి