
470views
న్యూఢిల్లీ: ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ జుబైర్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. జుబైర్ అరెస్ట్‌ను ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ధ్రువీకరించారు.
2020 నాటి కేసుకు సంబంధించి ఇవాళ ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారని, అయితే ఆ కేసులో అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి జుబైర్‌కు రక్షణ ఉందని తెలిపారు. దీంతో మరో కేసులో జుబైర్‌ను అరెస్ట్ చేశారని, దానికి సంబంధించి ముందస్తు నోటీసులు, ఎఫ్‌ఐఆర్ కాపీ తమకు ఇవ్వలేదని ఆరోపించారు.
Source: EtvBharat





