
348views
గువాహటి: అసొంలోని సరుపథార్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 26 సీట్లకు ఈనెల ఎనిమిదోతేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం సంచలనమైంది.
ఈ ఘటనను ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ తీవ్రంగా ఖండించారు. ఘటనా స్థలిని సందర్శించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సరుపథార్ కౌన్సిల్ నియోజకవర్గంలోని ప్రజలను ఎవ్వరు బెదరించినా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ మద్దతుదారులు కానీ, కాంగ్రెస్ మద్దతుదారులు కానీ ఎవ్వరికైనా ఇది వర్తిస్తుందని, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గూండారాజ్‌ను అనుమతించమని అన్నారు.





