
న్యూఢిల్లీ: గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నేడు భారత దేశం అమలు చేస్తున్న జీవవైవిద్య, వన్య ప్రాణులకు సంబంధించిన విధానాల వల్ల వన్యప్రాణులు రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు. పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యాన్ని నిర్దిష్ట గడువుకు ఐదు నెలల ముందే సాధించామని తెలిపారు.
ప్రకృతిని పరిరక్షించేందుకు తన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సద్గురు ప్రారంభించిన ‘నేల తల్లిని రక్షించండి’ ఉద్యమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా అనే సంగతి తెలిసిందే.
మన దేశంలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు పట్టించుకోదగిన స్థాయిలో లేవని, అయినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కోసం మన దేశం చాలా చర్యలు చేపడుతోందని మోదీ చెప్పారు. అత్యధిక కర్బన ఉద్గారాలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి వెలువడుతున్నాయన్నారు. ప్రకృతిని పరిరక్షించేందుకు మన దేశం బహుముఖ కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు దీనికి దోహదపడుతున్నాయన్నారు.





