News

ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్రం ప్రగతి

463views
  • వంద దేశాలకు దేశీయ ఔషధాల ఎగుమతి.. ప్రధాని మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఔషధాలు, టీకాలను ఎగుమతి చేయడం, విదేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, రక్షణపరంగా సొంతకాళ్ళ‌పై నిలబడేలా చేపట్టిన చర్యలు.. వీటన్నింటికీ కేంద్రం సంస్కరణలే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ దిశగా కేంద్ర సర్కారు సాధించిన ప్రగతిని హైలైట్‌ చేస్తూ ప్రచురితమైన వార్తా అంశాలను ప్రధాని ట్వీట్‌ చేశారు.

ఈమేరకు అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్రం సాధించిన ప్రగతి నివేదికను మోదీ వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పుడు 100 దేశాలకు భారత్‌ ఔషధాలను ఎగుమతి చేసిందని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ కారిడార్ల ఏర్పాటు, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడంలాంటి చర్యలను ఆయన ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి