
671views
-
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్య
గ్వాలియర్: “హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని ముస్లింలు కూడా అనుకున్నారు. అందువల్లనే పాకిస్థాన్ ఏర్పడింది. తొలుత హిందువులమని భావించే వారి సంఖ్య తగ్గింది. తరువాత హిందువుల సంఖ్యే తగ్గింది.
పాకిస్థాన్ ఏర్పడటం వల్ల ఇక ఇది హిందుస్థాన్ అయింది. హిందూమతానితో సంబంధం ఉన్నవాటినే ఇక్కడ అభివృద్ధి చేయాలి.” ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ అన్నారు. గ్వాలియర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితిలో మరోసారి దేశ విభజన జరగదని, అయితే హిందువులు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.





