
-
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
దాద్రా నగర్ హవేలీ: ఇక్కడి సిల్వాస్సాలోని మదర్సా హాస్టల్‌లో చదువుతున్న ఓ బాలికపై మదర్సా మౌల్వీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మౌల్వీ షేక్ మహ్మద్ తారీఖ్‌ను పోస్కో చట్టం కింద అరెస్టు చేశారు. బాధితురాలి వయస్సు 17 ఏళ్ళు. మౌల్వీ భార్య తన భర్త నిర్దోషి అని చెబుతోంది. ఆరోపణలు నిరూపిస్తే భర్త నుంచి విడాకులు తీసుకుంటానని మౌల్వీ భార్య చెబుతోంది. పోలీసుల కథనం ప్రకారం… బాలిక మదర్సా హాస్టల్‌లో ఉండి చదువుకుంటూ ఉంది.
ఇంతలో మౌల్వీ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తర్వాత విద్యార్థిని అనారోగ్యంగా ఉందని కుటుంబాన్ని మదర్సాకు పిలిపించారు. కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగినట్టు నివేదిక నిర్ధారించడంతో మౌల్వీని అరెస్టు చేశారు.
మౌల్వీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. మౌల్వీ హాస్టల్‌లోని ఇతర బాలికలను కూడా లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలను అతడు బెదిరించి అత్యాచారం చేశాడని అనుమానిస్తూ ఉన్నారు.
Source: News Track





