
542views
-
పోలీసు అధికారిని కాల్చి చంపిన ముష్కరులు
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని బాటమలూలో కానిస్టేబుల్‌పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను స్థానికంగా ఉన్న ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనను వివిధ పార్టీలు ఖండించాయి.





