News

ఫేస్‌బుక్ చెప్పేదొకటి చేసేదొకటంటూ కోర్టుకెక్కిన మెటా

564views
  • పేరు మార్పుతో కొత్త స‌మ‌స్య‌లు

చికాగో: పేరు మార్చుకొన్నా ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్‌ సంస్థ ‘మెటా కంపెనీ’ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్‌ రీబ్రాండింగ్‌ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ ప్రకటన విడుదల చేశారు. ఫేస్‌బుక్‌ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు. మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్‌ లాయర్లు వెంటాడుతున్నారని నేట్‌ వెల్లడించారు. తాము ఫేస్‌బుక్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్టు వెల్లడించారు. అక్టోబర్‌ 28వ తేదీన పేరును మెటాగా మారుస్తున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మెటా కంపెనీ’ కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి