News

హిందూ జర్నలిస్ట్ ఇంటిపై బంగ్లాలో ముస్లిం ఛాందసుల దాడి

184views

బంగ్లాదేశ్ లో హింసా కాండ కొనసాగుతూనే వుంది. ఛాందసులు ఇప్పుడు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై మాట్లాడినందుకు హిందూ జర్నలిస్ట్ సుశాంత్ దాస్ గుప్తా ఇంటిని ముస్లిం ఛాందులు ధ్వంసం చేశారు.బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ డివిజన్‌లోని హబీగంజ్ పట్టణంలోని చిరకండి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

ముస్లిం ఛాందస మూక తమ ఇంటిని విధ్వంసం చేసి, దోపిడీకి పాల్పడిందని సుశాంత్ దాస్ గుప్తా వెల్లడించారు.శుక్రవారం తన ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేసి, దోచుకున్నారని, తన కుటుంబం తృటిలో తప్పించుకుందని సుశాంత్ దాస్ గుప్తా పేర్కొన్నారు.ఈ దాడికి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం పనే అని మండిపడ్డారు.

మరోవైపు హిందూ జర్నలిస్ట్ సుశాంత్ దాస్ గుప్తా ఇంటిపై ముస్లిం ఛాందసులు దాడి చేసిన వైనం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. ఈ దాడి నుంచి సుశాంత్ గుప్తా కుటుంబీకులు తృటిలో తప్పించుకున్నారు.

సుశాంత్ దాస్ గుప్తా ప్రస్తుతం యూకేలో జర్నలిస్టుగా వుంటున్నాడు. గత మూడు సంవత్సరాలుగా యూకేలోనే వుంటూ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.2020లో డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ (DSA) కింద ఏకపక్ష అరెస్టు తర్వాత, బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి యూకేలోనే వుంటూ దినపత్రిక అమర్ హబీగంజ్‌లో పనిచేస్తున్నారు.