News

ఉత్తరాఖండ్ లో పాఠ్యాంశాలుగా రామాయణ, భారతాలు

193views

మన సంస్కృతి, ధర్మం విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల సిలబస్ లో రామాయణం, మహా భారత గాథలను ప్రవేశపెట్టనుంది.దీని ద్వారా పాఠశాలల్లో, విద్యార్థుల్లో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో తమకు NCERT పాఠ్యాంశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రం పరిధిలో 30 శాంత సొంత సిలబస్ ను జోడించడానికి కూడా కేంద్రం అనుమతిస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలకు అనుగుణంగా, భారతీయ సంప్రదాయం, స్థానికంగా సందర్భోచిత జ్ఞాన వ్యవస్థలు మరియు విలువ ఆధారిత విద్యను రాష్ట్ర పాఠ్యాంశాల్లో చేర్చాం.కాబట్టి, NEP నిబంధనల ప్రకారం, మేము పాఠశాల సిలబస్‌లో మహాభారతం మరియు రామాయణం నుండి సారాంశాలను చేర్చుతున్నాం’’ అని విద్యాశాఖ పేర్కొంది.

అయితే ఈ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే తాము కసరత్తు చేశామని, అయితే ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఇప్పటికి సరిపోతుందని తెలిపింది.

ఇప్పటికే ఉత్తరాఖండ్ పాఠశాలల్లో భగవద్గీతను ప్రవేశపెట్టారు. ఇప్పటికి విజయవంతంగా సాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మూల్యాంకనం కొనసాగుతోందని, సమీక్షా సమావేశాలు, పాఠశాలల్లో ఎంత వరకు కొనసాగుతుందో కూడా సమీక్షిస్తున్నారు.