Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

26views

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. భారత్ మాతా మరియు హిందూ ధర్మాన్ని అవమానించారనే ఆరోపణలతో హిందూ రాష్ట్ర సమన్వయ సమితి మరియు ఇతర హిందూ సంఘాలు ఈ ప్రదర్శనను వ్యతిరేకించాయి.

నసీఫ్ అక్తర్ తన పాత ప్రదర్శనలలో హిందూ దేవుళ్లపై, హిందూ ధర్మంపై అభ్యంతరకరమైన జోకులు వేశారని, ఇది హిందూవుల మనోభావాలను దెబ్బతీసిందని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను రద్దు చేయాలని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ప్రదర్శనను రద్దు చేశారు. ఈ నిరసనల తర్వాత, నసీఫ్ అక్తర్ తన భారతదేశ పర్యటనలోని అన్ని షోలను రద్దు చేసుకున్నట్లు ఒక వీడియోలో ప్రకటించారు.

బెంగళూరులో జరగాల్సిన అతని షోను కూడా హిందూ సంస్థల నిరసనల కారణంగా రద్దు చేశారు.