
406views
భాగ్యనగరం: ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి ఆదిలాబాద్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.4లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఉట్నూరులో ఆరేళ్ళ బాలిక బిక్షాటన చేస్తుండగా డబ్బు ఆశచూపి ఖాలీద్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Source: Way2news





