
67views
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో నియమితులైన అనిల్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు.
దాదాపు 40 ఏళ్ళపాటు వివిధ హోదాల్లో ఇండియన్ ఆర్మీలో పనిచేసిన అనిల్ చౌహాన్ బిపిన్ రావత్ దుర్మరణంతో సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. సైన్యంలో అతని విశిష్టమైన సేవలకు గుర్తింపుగా ”పరమ్ విశిష్ట సేవా మెడల్”, ”ఉత్తమ్ యుధ్ సేవా మెడల్”, ”అతి విశిష్ట సేవా మెడల్” లను అందుకున్నారు. జమ్ము కశ్మీర్‌తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్ ఇన్‌సర్జెన్సీలో ఆపరేషన్స్ చేపట్టడంలో అనిల్ చౌహాన్ నేర్పరిగా పేరు గడించారు.
Source: EtvBharat