
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్-16 యుద్ధ పరికరాలను పాకిస్తాన్‌కు విక్రయిస్తున్నట్టు బైడెన్ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది.
ఎఫ్-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్ చేయలేరని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.





