News

హిందూ మహిళలపై ఆగ‌ని అఘాయిత్యాలు!

471views

కరాచీ: పాకిస్తాన్‌లో హిందూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. సింధ్ ప్రావిన్స్ లో తాజాగా ఇద్దరు బాలికలు, ఓ మహిళ అపహరణకు గురయ్యారు. వారిని బలవంతంగా మతమార్పిడి చేసి, ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. 14 ఏళ్ళ‌ మీనా మేఘ్వాలను నాసర్‌పూర్ ప్రాంతం నుంచి అపహరించగా, మరో బాలికను మీరిపుర్ఖాస్‌ నుంచి ఎత్తుకెళ్ళారు. మూడో ఘటనలో.. ముగ్గురు పిల్లల హిందూ మహిళ ఆకస్మికంగా అదృశ్యమైంది. తర్వాత ఆమె ముస్లిం పురుషుడితో కనిపించింది. బలవంతంగా తన భార్యను ఇస్లాం మతంలోకి మార్చి.. వివాహం చేశారని ఆమె భర్త రవి కుర్మీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మీరపురాస్ పోలీసులు ఎస్ఎఆర్ దాఖలు చేసేందుకు కూడా నిరాకరించారని పేర్కొన్నారు. ముస్లిం పురుషుడిని పెళ్ళి చేసుకున్న రాఖీ అనే మహిళ మాత్రం తాను ఇష్టపూర్వకంగానే ఇస్లాం మతంలోకి మారానని తెలిపినట్టు స్థానిక పోలీసు అధికారి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి