News

శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు

333views

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు , తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు ఉదయం ఉత్సవాలకు ప్రారంభ పూజలు జరుగుతాయి. సాయంత్రం భ్రమరాంబా దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి