
466views
చెన్నై: కొద్ది రోజుల క్రితం, మద్రాస్ హైకోర్టు కోయంబత్తూర్ పోలీసులను స్థానిక జమాత్ నుండి సమ్మతి పొందిన తరువాత, ముస్లింలు అధికంగా నివసించే హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయక చవితి జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
ఉక్కడం సౌత్‌లోని పుల్లకాడు హౌసింగ్ యూనిట్‌లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు, ఆగస్టు 31న వినాయక చతుర్థి పండుగ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహాలక్ష్మి వేసిన పిటిషన్‌ను ఆగస్టు 26న జస్టిస్ ఎన్.సతీష్‌కుమార్ విచారిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
“పిటిషనర్ ఇచ్చిన హామీపై, పోలీసులు సరైన రక్షణ కల్పించాలి” అని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్ వారి హౌసింగ్ యూనిట్‌లో మాత్రమే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, వేడుకను జరుపుకోవాలని స్పష్టం చేశారు. విగ్రహంతో పాటు ఊరేగింపు చేయరాదని న్యాయమూర్తి తెలిపారు.
Source: VSKBharat





