News

రూ.316 కోట్లతో వినాయక మండపానికి ఇన్సూరెన్స్

473views
  • దేశంలోనే అత్యంత ఖరీదైన మండపంగా రికార్డు

ముంబయి: గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్‌ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ గణేశ్‌ మండపానికి ఏకంగా రూ.316 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించారు.

ముంబయిలోని కింగ్స్‌ సర్కిల్‌లో జీఎస్‌బీ సేవా మండల్‌ నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా నిలిచింది. ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు అక్కడకు వచ్చే భక్తులకు అక్కడి నిర్వాహకులు భారీ బీమా చేయించారు. ఇందుకోసం రూ.316కోట్ల మొత్తానికి ఇన్సూరెన్స్‌ చేయించగా.. ఇందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు ఈ పరిధిలోకి వస్తాయి. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో కోటి రూపాయల బీమా తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి