
409views
మన దేశంలో ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వరకు నిర్మించే రహదారి.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వన్య ప్రాణి సంరక్షణ హైవే కారిడార్ గా నిలవనుంది. ఆ రహదారిలోని వన్య ప్రాణులకు, చెట్లకు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ రహదారిని నిర్మిస్తూ ఉండటం గమనార్హం. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా, అక్కడి వన్య ప్రాణులకు ఇబ్బంది కలుగకుండా ‘దాత్ కాళీ’ ఆలయం వద్ద 340 మీటర్ల సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వన్య ప్రాణులను రక్షించడమే కాకుండా ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. దీన్ని కేంద్ర ప్రభ్త్వం దాదాపు రూ.12వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. 2023లో ఈ రహదారిని ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.





