News

వ్యవసాయ రంగంలో భారత్‌ ప్రపంచ సారథిగా ఎదగాలి

362views

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు.

ఇందుకోసం ట్రేడ్‌ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్‌ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి