News

ఐఎస్ఐఎస్‌తో లింకులు… ఢిల్లీ విద్యార్థి మోసిన్ అహ్మ‌ద్ అరెస్ట్‌

369views

న్యూఢిల్లీ: గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపింది.

ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌ వేదికగా సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై నిధులు సేకరిస్తున్నాడని ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వేర్వేరు దేశాల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులను సిరియాకి చేరవేస్తున్నాడని ఎన్ఐఏ వివరించింది. అయితే ఈ ఆరోపణలను మోసిన్ కుటుంబం తోసిపుచ్చింది. కోర్టులో సవాలు చేయబోతున్నట్టు తెలిపింది.

మోసిన్‌కి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్నాడు. కాగా ఢిల్లీలోని బత్లా ఏరియాలో నివాసముంటున్న మోసిన్‌ను ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలు నడుపుతున్నాడని, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది.

మోసిన్ అహ్మద్‌ను ఐఎస్ఐఎస్ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని, సానుభూతిపరుల నుంచి ఇటు భారత్‌తోపాటు విదేశాల నుంచి నిధులు సేకరించాడని పేర్కొంది.

జూన్ 25న ఏజెన్సీ నమోదు చేసిన “ఐఎస్ఐఎస్ ఆన్‌లైన్, ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలకు” సంబంధించిన కేసులో శనివారం అతని ప్రాంగణంలో, త‌దిత‌ర‌ చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత అహ్మద్‌ను అరెస్టు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి