
457views
కాబుల్: అమెరికా డ్రోన్ దాడిలో అల్‌ఖైదా నేత అల్ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తాలిబన్ల ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వానికి, తాలిబన్ నేతలకు అక్కడేం జరిగిందో ఏమాత్రం తెలీదని దోహాలో తాలిబన్ల ప్రతినిధి సుహైల్ షహీన్ అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. దీనిపై నాయకత్వం సైతం సమావేశమవుతోందని, వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు.
Source: Eenadu





