
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ నుండి నివేదించబడిన ఒక క్రూరమైన సంఘటన ఇది. మహ్మద్ అష్రఫ్ అయిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఫసిదేవా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితురాలు దుర్గారాయ్ కుమార్తెగా గుర్తించారు. పోలీసుల ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు అష్రాఫ్‌పై ఆరోపణలు చేశారు. తాము కూలిపని కోసం బయటకు వెళ్ళాము. అప్పుడు మా కుమార్తె ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకుంటోంది. ఇదే సమయంలో మహ్మద్ అష్రఫ్ చిన్నారిపై అత్యాచారం చేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుమార్తె అనారోగ్యానికి గురైందని, అష్రఫ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని తన కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. పశ్చిమ బెంగాల్‌లో మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలికలపై ఒకే రోజు మూడు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. జూన్ 2021లో మాల్దాలో తొమ్మిదేళ్ళ చిన్నారిపై రఫీకుల్ ఇస్లాం అత్యాచారానికి పాల్పడ్డాడు.
Source: HINDU POST





