
386views
కుల్గాం: జమ్ముకశ్మీర్, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై ముష్కరులు కాల్పులకు పాల్పడగా.. ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సైనికాధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. అనంత్‌నాగ్ జిల్లాలోని హంగల్‌గుండ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు చెప్పారు. హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించారు.





