
420views
-
15 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం
పుల్వామా: జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు, భద్రతా సిబ్బంది. లాసిపోరా ప్రాంతం అర్ముల్లా గ్రామంలోని ఓ తోటలో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర కుట్రకు సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఐఈడీని స్వాధీనం చేసుకోవటం ద్వారా భారీ కుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఆ పేలుడు పదార్థాలు సుమారు 15 కిలోలు ఉంటాయి. పుల్వామా, లిట్టెర్ ప్రాంతంలోని ఆర్ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు వాటిని ఓ తోటలో పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.





