ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 10 రాత్రి తిత్లి తుఫాను కారణంగా 16 మండలాలకు ఈ తుఫాను ప్రభావం ఉన్నది.తీవ్రంగా 7 మండలాలకు ఉంది.7 మండలలోని కొబ్బరి రైతులు పూర్తిగా నష్టపోయినారు. మత్యకారులకు పడవలు,వలలు,ఎక్కువ గ్రామాల్లో రేకులు విరిగిపోయినాయి. ఇండ్లు కూలిపోయినాయు.10 వ తేదీ నుండి కరెంటు లేదు. దీని కారణంగా మంచినీటి సమస్య, మాములు నీరు సమస్య,కరెంట్ లేని కారణంగా దోమల సమస్య ఉన్నది.తక్షణం కొవ్వొత్తులు,దోమ తెరలు,దోమల కాయలు,ప్లాస్టిక్ పట్టాలు వెంటనే అవసరం ఉన్నది.
ఆ సమయంలో సేవాభారతి కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగారు. తమకు అందుబాటులో వున్న వారి దగ్గరి నుంచి డబ్బులు, కొన్ని వస్తువులు సేకరించారు. అవసరమైన వారిని గుర్తించారు. ఆయా గ్రామాలకు వెళ్లి ఆయా కుటుంబాలను ఆదుకున్నారు.
అక్టోబర్ 24 వ తేది మెళియపుట్టి మండలం లోని గినియపేట(10), జీరిభద్ర(8) సవర జెర్రిభద్ర (6) ,సవర లింగుపురం(11) బాగా పైకప్పు దెబ్బతిన్న ఇండ్లకు టర్పైన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో టెక్కలి ఖండ కార్యవాహ శ్రీ. కిషోర్, కెవికె శ్రీకాంత్,సవర భాగీరథి మరికొందరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు …
అక్టోబర్ 25న మందస మండలం సింగుపురం గ్రామంలో దుప్పట్లు, దోమతెరలు,కొవ్వొత్తులు పంపిణీ చేయడం జరిగింది. 26న మందస మండలం బిత్రబంద గ్రామంలో కొవ్వొత్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామాలలోని ప్రజలు సేవాభారతి నిస్వార్ధ సేవను కొనియాడుతున్నారు.
https:// sevabharatiap.com

















