
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి, సేవా కార్యక్రమాల్లో నే కాదు, ధార్మిక కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటుంది. నవరాత్రులందు పూజలందుకుని అమ్మ ఒడికి చేర పయనమైన గణనాథుని అంగ రంగ వైభవంగా సాగనంపే భక్తులు అలసి పోతే మార్గమధ్యంలో వారికి ప్రసాదము, మంచి నీరు అందించి వారికి పునరుత్తేజం కల్పించడం సంఘమిత్ర సభ్యులకు ఆనవాయితీ.

గణేష్ నిమజ్జనం సందర్భంగా సంఘమిత్ర ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పాలూరి రామకృష్ణ, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శ్రీ జె వెంకటేశ్వర్లు, సహకార్యాదర్శి శ్రీ కరణం సుందర్ రావు, కోశాధికారి శ్రీ సముద్రాల నాగరాజయ్య, కార్యవర్గ సభ్యులు డాక్టర్ అశోక్ కుమార్, శ్రీ ఉసిరికాయల రమణయ్య గౌడ్, శ్రీ మోదాల రామాంజనేయులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.





