
చలి కాలం ప్రవేశిస్తున్న సందర్భంగా సంఘమిత్ర సేవా సమితి ఆద్వర్యంలో చెంచు గూడాలలో దుస్తుల పంపిణీ.చేపట్టారు. సంఘమిత్ర సేవ సమితి ద్వారా 32 చెంచు గూడేలలో సంచార వైద్యం ద్వారా చెంచు లకు వైద్య సేవలు అందిస్తున్నారు. యర్రమఠం,పాలెంచెరువు,చదరం పెంట తదితర చెంచుగూడాలలో చీరలు , డ్రస్సులు, ప్యాంట్లు, చొక్కాలు పంపిణీ చేశారు .నాగలూటి, జానాల, పాతమాడుగుల తదితర చెంచు గూడాలలో దుస్తులు, దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా సంఘమిత్ర అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆపన్నులను ఆదుకోవడానికి సంఘమిత్ర నిత్యం ముందుంటుందని, దారిద్ర నారాయణులను సేవించుకునే భాగ్యం సంఘమిత్ర ద్వారా తమకు కలిగినందుకు సంతోషంగా వుందని, సంఘమిత్ర ఆద్వర్యంలో నిరంతరం చెంచులకు సంచార వైద్యశాల ద్వారా వైద్య సేవలతో పాటు దుస్తుల పంపిణీ కూడా జరుగుతుందని తెలిపారు. కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్, విజయశ్రీ, జ్యోతి తదితరులు పలువురు సంఘ మిత్ర కార్య కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనారు.
Source : SANGHAMITHRA, NANDYAALA.





