
-
దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం
ఆదిలాబాద్: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల విచారణలో తెలంగాణ లింకులు బయటికి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్.ఐ.ఎ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. హర్యానాలో పట్టుబడిన ఉగ్రవాదులకు ఆదిలాబాద్ లింక్ ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
నలుగురు ఉగ్రవాదులు ఎన్ఐఏ కీలక సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఆదిలాబాద్‌కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు వచ్చినట్టు తేలింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు జహీరాబాద్‌కి పేలుడు పదార్థాలను తీసుకొచ్చారని గుర్తించారు. గత మార్చి 30, ఏప్రిల్ ఒకటో తేదీనే జహీరాబాద్‌కి ఐఈడీ, మారణాయుధాలను చేరవేసినట్టు తేలింది. హైదరాబాద్-జహీరాబాద్ జాతీయ రహదారిపై దగ్గర్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆయుధాలు డెలివరీ అయినట్టుగా ఎన్ఐఎ నిర్ధారించింది.
మే అయిదోతేదీన హర్యానా పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. కర్నాల్ లో నలుగురు ఖలిస్తానీ తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో బస్తారా టోల్ ప్లాజా సమీపంలో ఫిరోజ్‌పూర్‌కు చెందిన ముగ్గురు, లూథియానాకు చెందిన ఒక తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపిందర్‌గా గుర్తించారు. పట్టుబడిన నిందితులు పాకిస్థాన్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు డ్రోన్స్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేస్తున్నట్టు కర్నాల్ ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులు ఆదిలాబాద్ కు ఆయుధాలు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో కేసును ఎన్ఐఏకి అప్పగించారు.
Source: NationalistHub





