
భాగ్యనగరం: జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితులను బీజేపీ ఎంఎల్ ఎన్.రఘునందన్ రావు కల్పించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేరస్తులను వదిలివేస్తూ, న్యాయం కోసం పోరాడే వారిపై కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు. తెరాస, ఏంఐఎం పార్టీకు బీ టీమ్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తున్నట్టు మండిపడ్డారు. అసలు నిజాలను సాక్షాలతో పాటు వెలుగులోకి తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే వాటిని నియంత్రించాల్సిన పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితులకు సంబంధించిన వారిపై పోరాడకుండా, బీజేపీ కార్యాలయం, ఎమ్మెల్యే రఘునందన్ పై విమర్శలు చేయడం దేనికి సంకేతమని అరుణ ప్రశ్నించారు. ఇకనైనా పోలీసులు పక్షపాత ధోరణి మాని, నిందితులకు కొమ్ముకాయకుండా, బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలని, నగరంలో శాంతి భద్రతల పై శ్రద్ధ వహించాలని ఆమె హితవు పలికారు.
Source: Nijamtoday





