
446views
-
రహస్యంగా రెండో సైనిక స్థావర నిర్మాణం
న్యూఢిల్లీ: చైనా భూభాగం బయట రహస్యంగా రెండో సైనిక స్థావరాన్ని ఆసియాలో నిర్మించతలపెట్టింది. దీనికి కంబోడియాను పావుగా ఎంచుకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వాన్ని ముగ్గులోకి దించింది. ఈ స్థావరం నిర్మాణ పనులను గురువారం నుంచి మొదలుపెట్టనున్నట్టు ‘ది వాషింగ్టన్ పోస్టు’ కథనం వెలువరించింది.
అదే రోజు నిర్మాణం, ఆర్థిక సహకారంలో చైనా పాత్ర తేలే అవకాశం ఉంది. మరోపక్క కంబోడియా ప్రభుత్వం… అబ్బే అటువంటిదేమీ లేదు అంటూ బుకాయిస్తోంది. కేవలం కంబోడియా నౌకాదళాన్ని బలోపేతం చేయడానికే ఈ ఆధునికీకరణ పనులు అని చెబుతోంది. ఈ నౌకాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రం ఈ వారం రెండు భూమి పూజలు నిర్వహిస్తున్నట్టు కంబోడియా ప్రతినిధి పైసిఫాన్ ధ్రువీకరించారు. వాస్తవానికి ఈ సైనిక స్థావరం నిర్మిస్తే నిఘా పరికరాలు మలక్కా జలసంధికి అత్యంత సమీపంలోకి వచ్చి చేరతాయి.





