
458views
తిరుపతి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆరోజు ఉదయం ఎనిమిది నుంచి 8:17 నిముషాల మధ్య పండితులు మహూర్తం నిర్ణయించారని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ చైర్మన్ తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.





