News

సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు

337views

క‌శ్మీర్‌: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్‌గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలతో సుమారు 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోబాల్‌ కశ్మీ ర్‌ పరిస్థితులపై సమీక్ష జరిపిన మర్నాడే ఈ బదిలీలు జరగడం గమనార్హం. మిగతా ఉద్యోగులను కూడా విడతల వారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి