News

జమ్మూక‌శ్మీర్లో కార్మికులపై కాల్పులు

511views

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులపై ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం కుల్గామ్‌ జిల్లాలో మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను ముష్కరులు కాల్చి చంపిన ఘటన మరవక ముందే.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఇద్దరు కార్మికులపై ఉగ్రదాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరొక కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతి చెందిన కార్మికుడిని బిహార్‌కు చెందిన దిల్‌కుష్‌ కుమార్‌గా గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి