News

కశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర స‌మావేశం

500views

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో గురువారం బ్యాంకు మేనేజర్‌ విజయకుమార్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌, ‘రా’ చీఫ్‌ సామంత్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో గత మే నెల నుంచి వరుసగా లక్షిత హత్యలు జరుగుతున్న జమ్ముకశ్మీర్‌ శాంతిభద్రతలపై చర్చించారు.

వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశం కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన తాజా హత్యతో ఒకరోజు ముందే నిర్వహించారు. నార్త్‌బ్లాకులోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. సమావేశం వివరాలు బయటకు తెలియకపోయినా కశ్మీర్‌ పరిస్థితులపైనే మాట్లాడుకున్నట్టు స‌మాచారం. ఈ చర్చలు శుక్రవారం నాడూ కొనసాగనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి