
-
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు
-
వివేక్ ప్రసంగాన్ని అడ్డుకున్న పాకిస్తానీయులు
న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేక ఆహ్వానం పలికింది. అలాగే మరోవైపు దేశంలోని పలు యూనివర్సిటీలతో పాటు విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించాయి. తాజాగా ఈయనకు లండన్‌కు చెందిన కేంబ్రిడ్జితో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం ఆహ్వానించింది. ఆ యూనివర్సిటీలో పాకిస్తాన్‌కు చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. పాకిస్తాన్, కశ్మీర్‌కు చెందిన వాళ్ళే తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే యూనివర్సిటీలో సుభాష్ చంద్రబోస్ చదువుకున్నారు. ఆయన 150 జయంతి జరగకుండా ఆయన్ని ఫాసిస్టు అంటూ ఆయన జయంతిని జరగకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
కశ్మీర్‌లో హిందువులపై జరిగిన దురాగతాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించడమే నేను చేసిన నేరమా? అంటూ ఆక్రోషం వెళ్లగక్కారు. మన దేశంలో ప్రజల చేత ప్రజలచే ఎన్నుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉండటం వల్లే ఈ సినిమా తీయగలిగనన్నారు. అదే సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు నన్ను ఆహ్వానించారు. తీరా అక్కడి వెళితే.. మేము పొరపాటున ఒకరు బుక్ చేసిన డేట్‌లోనే మీ ప్రసంగానికి పొరపాటున అనుమతి ఇచ్చాము.
మీకు జూలై 1న అపాయింట్‌మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు ఆక్కడి యూనివర్సిటీ వాళ్లు. ఆ రోజున యూనివర్సిటీలో ఏ స్టూడెంట్ ఉండరు. విద్యార్థులు ఎవరు లేనపుడు నేను వచ్చ చేసేదేమి ఉండదు. కావాలనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు అక్కడున్న పాకిస్తాన్, కశ్మీర్ స్టూడెంట్స్ భయం వల్ల తనకు ఇచ్చిన అపాయింట్‌మెంట్ కాన్సిల్ చేసినట్టు వివేక్ అగ్నిహోత్రి చెప్పారు.
వాళ్ళు క్యాన్సిల్ చేసింది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అన్నట్టు చెప్పారు. అక్కడున్న కశ్మీర్, పాకిస్తాన్ స్టూడెంట్స్ ఇస్లామోఫోబియా వల్లే వాళ్ళు తన ప్రసంగాన్ని కాన్సిల్ చేసినట్టు చెప్పారు. వాళ్ళు కాన్సిల్ చేసింది జెనోసైడ్‌తో పాటు హిందువులను అని తెలిపారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో తనకు జరిగిన అవమానం ప్రతి ఒక్క భారతీయుడుదని వివేక్ అగ్నిహోత్రి ఆవేదన వెలిబుచ్చారు.





