News

జమ్మూలో ఉగ్రవాదాన్ని ఏరి పారేయండి: హోంమంత్రి అమిత్ షా

517views

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలని నిజం చేయాలని.. ఉగ్రవాదాన్ని ఏరి పారేయాలి అని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దు చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలకు సూచించారు.

జూన్​ 30న ప్రారంభం కానున్న అమర్​నాథ్​ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ పాండే పలువురు ఉన్నతాధికారులు హజర్యయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి