
381views
బారాముల్లా: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా దివాన్‌బాగ్‌లోని ఓ దుకాణంపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన తర్వాత.. జమ్ము కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.





