News

స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్

246views

భువ‌నేశ్వ‌ర్‌: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు.

“ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు” అని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత నౌకాదళం.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.

సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి