News

రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు

638views
  • లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

క‌శ్మీర్‌: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు.

కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గత శుక్రవారం కశ్మీర్ పండిట్ ఉద్యోగులు నిరనసలకు దిగారు. ప్రదర్శకులపై పోలీసులు బుద్గాంలోని షేక్‌పోర లాఠీచార్జి జరపడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

భట్ హత్యపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం ఇందుకోసం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. “భట్ హత్య టార్గెటెడ్ కిల్లింగ్. భయోత్పాతం సృష్టించేందుకు జరిగిన ప్రయత్నం. ఆయన చాలా మంది ఉద్యోగి. ఈ ఘటనపై దర్యాప్తునకు మేము సిట్ ఏర్పాటు చేశాం. ఎస్‌హెచ్‌ను కూడా అటాచ్ చేశాం. అన్ని కోణాల్లోంచి సిట్ దర్యాప్తు జరుపుతుంది” అని సిన్హా తెలిపారు.

నిరసనకారులపై పోలీసు ఫోర్స్ ఉపయోగించడంపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుంద‌ని, ఉద్యోగులకు వారం రోజుల్లో సురక్షితమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. వారికి ఉన్న ఇతర సమస్యలపై కూడా దృష్టిసారిస్తామని, ఉద్యోగుల ఆవేదన, కష్టాలను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు.

Source: NijamToday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి