
572views
-
హిజాబ్‌తో తరగతి గదిలో నమాజ్ చేసిన విద్యార్థిని, విచారణ నిర్వహిస్తున్న అధికారులు
భోపాల్: కర్ణాటకలో హిజాబ్ వివాదం సద్దుమణగక ముందే, మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో నమాజ్ వివాదం ప్రారంభమైంది. డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని తరగతి గదిలో నమాజ్ చేస్తున్నట్టు హిందూ జాగరణ్ మంచ్ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులకు సమర్పించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సంతోష్ సహ్‌గౌర మాట్లాడుతూ, హిందూ జాగరణ్ మంచ్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ఫిర్యాదుతోపాటు వీడియో కూడా అందిందని చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ తన నివేదికను మూడు రోజుల్లోగా సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.





