News

సింగపూర్‌లో తొలిసారిగా ఉగాది భాగవత సప్తాహం

499views

సింగ‌పూర్‌: సింగ‌పూర్‌లో తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారాలు సంయుక్తంగా ఉగాదిని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ చేతుల మీదుగా శ్రీమద్‌ భాగవత సప్తాహాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

2022 ఏప్రిల్ రెండోతేదీ నుంచి ఎనిమిదోతేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజు సాయంత్రం 4:30 గంటలకు (సింగపూర్‌టైం రాత్రి 7 గంటలకు) శని, ఆదివారాల్లో రాత్రి 10:30 గంటలకు (సింగపూర్‌ టైం మధ్యాహ్నం ఒంటిగంట) వర్చువల్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి